CM Jagan on Anantapur rains: అనంతపురంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. సహాయక చర్యలు, బాధితులను ఆదుకునే కార్యక్రమాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. అనంతపురంలో కుండపోత వర్షం, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల వివరాలు తెలిపారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.
బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. దీంతోపాటు బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు... ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని సీఎం తెలిపారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: