ETV Bharat / city

మండలానికి రెండు పీహెచ్​సీలు: ముఖ్యమంత్రి జగన్

ప్రభుత్వ వైద్యులను గ్రామాల బాట పట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో వైద్య సేవలందించేందుకు ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ వస్తోందన్న సమాచారం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

cm jagan review on health and nadu nedu
cm jagan review on health and nadu nedu
author img

By

Published : Dec 22, 2020, 3:39 PM IST

Updated : Dec 23, 2020, 1:55 AM IST

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జునతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిధులు సరిపడా ఇవ్వాలి

పేదలకు వైద్యమందించేందుకు నిర్దేశించిన ఆరోగ్య శ్రీ , ఆరోగ్య ఆసరా పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఉన్న రోగాలకు ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి...నిధులు కూడా ఆ మేరకు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులను అత్యంత నాణ్యంగా చేయాలని... పనులు పూర్తయ్యాక ఆస్పత్రుల్లో జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

కొవిడ్ సెకండ్ వేవ్​తో జాగ్రత్త

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని, ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వచ్చినా ప్రజలకు తగిన చికిత్స అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సీఎం ఆదేశించారు. రోజుకు 65 వేల టెస్టులు సగటున చేస్తున్నామన్న అధికారులు, టీచర్లకు, పిల్లలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సూపర్‌ స్పెషాల్టీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఇప్పుడు ఉన్న సదుపాయాలపై సీఎం సమీక్షించారు.

అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం ఉంది

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాలపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉందన్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్లు, అవి పని చేస్తున్న తీరుపై బ్రిటన్‌ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వ చేసే స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలన్నారు. దీనికి ఎలాంటి మౌలిక వసతులు కావాలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.

డాక్టర్లకు గ్రామాలు కేటాయించాలి

ప్రభుత్వ వైద్యులు గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేసేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేలా చూడాలన్నారు. నలుగురు డాక్టర్లు ఉంటే ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలన్నారు. వైద్యులు అవసరమైతే ఇంటింటికి వెళ్లాలని సూచించారు. ప్రతి నెల కనీసం 2 సార్లు డాక్టర్‌ తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యసేవలందించాలన్న సీఎం.. దీనివల్ల గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద వైద్యులకు అవగాహన ఏర్పడుతుందని, ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదుకు అవకాశం కలుగుతుందన్నారు.

ఆ ఆసుపత్రులపై దృష్టి పెట్టండి

104 వాహనాల ద్వారా రోగులకు చికిత్స అందించడం సులభతరమవుతుంని జగన్ అన్నారు. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన సహా తగిన చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకు వస్తారన్న దానిపై తేదీని కూడా ఖరారు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అమలు తీరును సమీక్షించిన సీఎం... పథకం కింద చికిత్స అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై ఆరా తీశారు. అలాంటి ఆస్పత్రులను ప్యానెల్‌ నుంచి తొలగించడమే కాకుండా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆధారాలు సేకరించి ఆయా ఆస్పత్రులపై జరిమానాలు కూడా విధించామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

సంపూర్ణ సేవలు అందేలా చూడాలి

ఆరోగ్యశ్రీ, హెల్ప్‌డెస్క్‌ల సర్వీసులు ప్రతి రోజూ మెరుగుపడాలని, పేషెంట్లకు పూర్తిస్థాయిలో సంపూర్ణ సేవలు అందేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రులలోనే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. అన్ని నెట్ వర్క్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలి. రోగుల పట్ల మనం అత్యంత సానుకూల దృక్పథంతో ఉండాలి. ఆరోగ్య శ్రీ కింద చేసే చికిత్సలు, ఆస్పత్రుల వివరాలను, 104 సేవలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంబులెన్స్‌ల నిర్వహణ పూర్తి సమర్థవంతంగా ఉండాలని వాటిని నిరంతరం పరిశీలన చేయించాలి.

- వైఎస్ జగన్మోహన్​రెడ్డి, ముఖ్యమంత్రి

కాలేజీల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్

ఆరోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమాలకు మొత్తం రూ.16,270 కోట్లతో అంచనా వేసి పనులు చేపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పలాస సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. కడప సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రికి పనులు మొదలయ్యాయని, జూన్, 2023 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్‌ టెండరింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

జాతీయ స్థాయి ప్రమాణాలతో నడపాలి

మచిలీపట్నం మెడికల్‌ కాలేజీకి డిసెంబరు నెలఖారులోగా టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు సీఎం జగన్​కు వివరించారు. మిగిలిన 12 చోట్ల మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపైనా సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. మార్చి 31 కల్లా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం పూర్తి కావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలన్నారు. పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనులను సెప్టెంబరు 2021 నాటికి, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనులను డిసెంబర్‌ 2021 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్మాణాలు పూర్తైన తర్వాత జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలని సీఎం సూచించారు. నిర్వహణలో నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా చేయడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలన్నారు.

ఇదీ చదవండి: అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

Last Updated : Dec 23, 2020, 1:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.