ETV Bharat / city

గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్​ - dawaleshwaram

గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోన్న దృష్ట్యా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సత్వరమే సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వరద ప్రభావానికి గురయ్యే గ్రామాలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద ప్రబావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా 2వేల రూపాయలు ఇవ్వాలన్నారు.

jagan
jagan
author img

By

Published : Jul 15, 2022, 9:41 PM IST

CM Jagan Review on Godavari Floods: గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏరియల్‌ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం సమీక్షించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న సహాయ చర్యలపై సీఎం సమగ్ర సమీక్షించిన సీఎం కీలక సూచనలు జారీ చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియామిస్తూ ఆదేశాలిచ్చారు. ఐదు జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులు నియమించారు. సీఎం ఆదేశాల మేరకు మొత్తం ఐదు వరద ప్రభావిత జిల్లాలకు ఐదుగురు సీనియర్‌ అధికారులను సీఎస్‌ నియమించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు మురళీధర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌లను నియమించారు. వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికన వారికి అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం సూచించారు. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

రేపు గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోందని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని ఆదేశించారు. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలన్నారు. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వాటిని వినియోగించుకోవాలన్నారు.గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్న ముఖ్యమంత్రి.. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో ఉంచాలని నిర్దేశించారు. వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం సూచించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్‌టవర్లకు డీజిల్‌ సరఫరా చేసి అవి నిరంతరం పని చేసేలా చూడాలన్నారు.

సీఎం జగన్​ ఏరియల్​ రివ్యూ: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వర్యం బ్యారేజీ, లంకగ్రామాల్లో పరిస్థితులను హెలికాప్టర్‌ ద్వారా స్వయంగా పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.