ఇవీ చదవండి:
కరోనా జాగ్రత్తలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష - కరోనా జాగ్రత్తలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
కరోనా జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నిరోధంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయవాడ, అనంతపురంలో ప్రత్యేక వార్డులకు రూ.60 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు.. సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రికి తెలిపారు.
కరోనా జాగ్రత్తలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష