కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి జగన్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. వైరస్ సంక్రమణను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా వైరస్ నిరోధక ద్రావణం చల్లించడమే కాక ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి పూర్తి సమాచారంతో పాటు సమీపంలోని 3 కిలోమీటర్ల పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఎం ఆరా తీశారు.
రెండ్రోజుల పాటు ఇంటింటి రీ సర్వే
నేటి నుంచి రెండ్రోజుల పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో ఇంటింటి రీ సర్వే చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం నాటికి ఈ రీ సర్వే పూర్తి కావాలని స్పష్టం చేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారికి సంబంధించిన అంశాలపైనా పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. ఏప్రిల్ 14 తేదీ వరకు దేశవ్యాప్త లాక్డౌన్కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం సమీక్షించారు. రోజువారీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో పాటు పేదవారికి ఆహారం తదితర అంశాల్లో ఇబ్బంది రాకుండా చూడాల్సిందిగా సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: