ETV Bharat / city

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్ - రైతుల సమస్యలపై సీఎం జగన్ సమీక్ష

లాక్డౌన్ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని… సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత మంత్రులు సహా అధికారులు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతులు, అక్కడ మార్కెటింగ్ పరిస్థితులపై ప్రతీరోజూ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ను మరింత సమర్థంగా అమలుచేసి... ముందులు సరఫరా చేయాలని ఆదేశించారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Apr 28, 2020, 7:48 PM IST

కొవిడ్‌-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. గడిచిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదయ్యాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 80,334 మందికి పరీక్షలు చేయించామని చెప్పారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.

దేశంలోనే అధిక సగటుతో పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాజిటివ్‌ కేసుల నమోదులో దేశం మొత్తం సగటు 4.13 శాతంగా ఉండగా... రాష్ట్రంలో 1.57శాతం ఉందని చెప్పారు. అలాగే కరోనా వల్ల మరణాల్లో దేశం మొత్తం సగటు 3.19 శాతం ఉండగా… రాష్ట్రంలో 2.46 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం నమోదవుతోన్న కేసులన్నీ కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

కంటైన్‌మెంట్‌ ఆపరేషన్​లో భాగంగా అక్కడ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్​కు వివరించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ల్యాబులు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబుల ఏర్పాటుపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ఇవన్నీ పూర్తైతే... ప్రతి జిల్లాలోనూ కరోనా పరీక్షలు చేసే ల్యాబులు అందుబాటులోకి వచ్చినట్లేనని వివరించారు.

తక్కువ లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్‌ కోరుకుంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిందని సీఎంకు వివరించారు. టెలీమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు సరఫరాపై అధికారులతో సీఎం చర్చించారు. మందులు సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. దీనికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని అధికారులు చెప్పారు.

నిరంతరం పర్యవేక్షించండి

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ పంటల మార్కెటింగ్, ధరలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగారు. మొక్కజొన్న, శనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చోట మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందన్న సీఎం… దీనిపై పత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా?, రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా?, అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి... అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని.. వాటి ధరలు సహా పూర్తి వివరాలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి రావాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

జోక్యం చేసుకోండి

అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చ జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవిని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రస్తుతం అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని అధికారులు తెలిపారు. ఫాంగేట్‌ పద్ధతిలో ధాన్యం కొనుగోలు స్థిరీకరణ అవుతుందన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు వచ్చినా వెంటనే జోక్యం చేసుకుని వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి... 'వీడియో సందేశాలు కాదు.. బతుకు పట్ల భరోసా ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.