ETV Bharat / city

కొవిడ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచండి : సీఎం జగన్

రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 138 ఆస్పత్రులు ఉండగా మరో 149 ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని సీఎం నిర్ణయించారు. దీంతో కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య 287కు పెరగనున్నాయి. కొవిడ్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని, వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుతున్న సేవలను బట్టి కొవిడ్ ఆస్పత్రులకు ర్యాంకింగ్ ఇవ్వాలని సూచించారు.. కొవిడ్ కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారు.

CM jagan review meeting on corona
కరోనాపై సీఎం సమీక్షా సమావేశం
author img

By

Published : Aug 21, 2020, 4:01 PM IST

Updated : Aug 21, 2020, 6:50 PM IST

కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోజరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రేటింగ్​లు ఇవ్వాలి...

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 287 ఆస్పత్రుల్లోనూ అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్తికర స్థాయిలో ఉండాలన్నారు. ఆ మేరకు వీలైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రమాణాలను నిరంతరంగా పర్యవేక్షించాలన్న సీఎం...అందిస్తోన్న వైద్యసేవలకు అనుగుణంగా కోవిడ్ ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని ఆదేశించారు.

సిబ్బంది వేతనాలు పెంచాలి...

కొవిడ్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలన్న సీఎం.. ఆస్పత్రుల్లో పని చేస్తున్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలని సూచించారు. మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలన్నారు. అన్నిచోట్ల రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలని.. విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి ఆ ప్రోటోకాల్‌ అమలు జరగాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలని సీఎం ఆదేశించారు.

ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల సమాచారంతో పాటు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్‌ సెంటర్‌ నంబర్‌ పెట్టాలి. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆ బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. రోగులకు వైద్యం చేయకుండా అనవసరంగా రిఫర్‌ చేస్తే బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. - సీఎం జగన్

హెల్ప్ డెస్క్​లు సమర్ధంగా పనిచేయాలి...

ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు మరింత సమర్థంగా పని చేయాలన్న ముఖ్యమంత్రి... రోగికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు, వారికి తగిన వైద్య సేవలు అందేలా ఆరోగ్యమిత్ర హెల్ప్‌ డెస్క్‌లు పని చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా పథకం సక్రమంగా అమలు అయ్యేలా కూడా ఈ హెల్ప్‌ డెస్క్‌లు చూడాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మందులు ఇవ్వడం, చికిత్స అందించడంతో పాటు, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఇవ్వాలన్నారు. ఇవే కాకుండా కొవిడ్‌ వస్తే ఏం చేయాలి, ఎవరికి ఫోన్‌ చేయాలి, ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలి, అనే విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి రోజూ ఈ అంశాలను పర్యవేక్షిస్తే నాణ్యమైన సేవలు అందుతాయని ఈ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.

ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డ ఇంటికి వెళ్లేటప్పుడు వారికి ఆర్థిక సహాయం అందించడంలో కూడా హెల్ప్‌ డెస్క్‌లు పని చేయాలని సీఎం వెల్లడించారు. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అకౌంట్​లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు

ఇవీ చదవండి:

సిబ్బంది మాట్లాడరు.. మందులివ్వరు.. సొంత వైద్యంతో అనర్థాలు

Last Updated : Aug 21, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.