కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. కరోనా పరీక్షల నిర్వహణకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాష్ట్రంలోనే తయారయ్యాయి. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కిట్లను తయారు చేశారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 50 నిమిషాల్లో కరోనా పరీక్షలు చేసి ఫలితం తెలుసుకునే సామర్థ్యం వీటికి ఉందంటున్నారు. ఒక కిట్‌తో రోజుకు 20 మందికి పరీక్షలు చేసేందుకు అవకాశం ఉంది. వారంలోగా 10 వేల టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, గౌతంరెడ్డి, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కరోనా నుంచి కోలుకున్నాక ఇలా చేయాల్సిందే!