ETV Bharat / city

రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ - ఏపీ రైతు భరోసా

రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా పథకం నిధుల విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన...అర్హత ఉన్న రైతులు మరో నెల రోజుల వరకైనా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతు ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.

cm jagan on raythu bharosa
cm jagan on raythu bharosa
author img

By

Published : May 15, 2020, 12:29 PM IST

Updated : May 15, 2020, 1:11 PM IST

రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధుల జమ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.13,500 ఇవ్వగలుగుతున్నామన్నారు. పెట్టుబడి సాయంతో రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. మేలోనే రూ.7,500 ఇవ్వాలనుకున్నాం..కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌లో రూ.2 వేలు ఇచ్చామని తెలిపారు.

జూన్‌ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం రూ.5,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భూములు సాగుచేసుకుంటున్న వారికి రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి వేళ మూడో విడతగా మరో రూ.2 వేలు అందిస్తామని వివరించారు.

రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది మా ప్రభుత్వం లక్ష్యం. కులాలు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది. మరో 15 రోజులైనా, నెల రోజులైనా అర్హత ఉన్న ప్రతి రైతు నమోదు చేసుకోవచ్చు. రైతుల పాత అప్పులకు జమ కాకుండా నగదు అందిస్తున్నాం. బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902కు ఫోన్‌ చేయవచ్చు.రైతుకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోంది. -ముఖ్యమంత్రి జగన్

ఈ-క్రాపింగ్‌ ద్వారా పంట రుణాలు

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ అసిస్టెంట్‌ ఉంటారని... గ్రామ స్థాయిలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. నాణ్యతతో కూడిన విత్తనాల విక్రయం జరుగుతుందన్న ఆయన... రైతులు ఏ పంటలు వేయాలనేది కూడా సలహాలు, సూచనలు ఇస్తారని వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కూడా చేస్తారన్నారు. ఈ-క్రాపింగ్‌ ద్వారా రైతులకు పంట రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని అన్నారు. దాని‌ ద్వారానే రైతుల తరఫున ప్రభుత్వమే బీమా కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తుందని పేర్కొన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ అన్నారు.

ఇదీ చదవండి :

నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..

Last Updated : May 15, 2020, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.