తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంతో పాటు పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌కు ఫిర్యాదు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. మంత్రుల వ్యాఖ్యలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ చేసిన ఫిర్యాదుపై భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికపై కూడా సమావేశంలో సీఎం చర్చించారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు లేదా భార్యకు టికెట్ విషయమై సమాలోచనలు జరిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ఆర్ భారీ విగ్రహం ఏర్పాటుపై భేటీలో మాట్లాడారు.
ఇదీ చదవండి