ETV Bharat / city

రోజుకు 80 టన్నుల ఆక్సిజన్‌ ఇప్పించండి.. ప్రధానికి సీఎం జగన్ లేఖ - ప్రధానికి సీఎం జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. కొవిడ్ కేసుల దృష్ట్యా జామ్‌నగర్‌ రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.

cm jagan
cm jagan letter to pm modi
author img

By

Published : May 16, 2021, 4:29 AM IST

రాయలసీమలో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) అవసరాల దృష్ట్యా కొవిడ్‌ కేసులు అదుపులోకి వచ్చేవరకు జామ్‌నగర్‌ రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.

రాష్ట్రం ఆక్సిజన్‌ కొరత నుంచి బయటపడాలంటే రోజూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలకు తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ రవాణాలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ నెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావలసిన ఆక్సిజన్‌ జాప్యంతో తిరుపతి ఆసుపత్రిలో 11 మంది రోగులు మృతి చెందారని సీఎం వివరించారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి కేటాయింపులు పెంచాలని డీపీఐఐటీకి చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌ రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి సరఫరా చేసిన 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాయలసీమలో కొరతను అధిగమించేందుకు ఎంతో రక్షణగా నిలిచిందని చెప్పారు. అందువల్ల రోజూ అక్కడి నుంచి 80 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా ఆదేశాలిచ్చి సహకరించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

ఎంపీ రఘురామ ఒంటిపై దెబ్బలు-పోలీసులు కొట్టినట్లు తేలితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.