ETV Bharat / city

'మంత్రులంతా శ్రీరామచంద్రులు కావాలి' - avanti fun in cabinet news

దశలవారీ మద్య నిషేధంపై మంత్రివర్గ భేటీలో ఆసక్తికర చర్చ జ‌రిగింది. మద్యం విధానం, ధరలపై  చర్చ సమయంలో సీఎం జగన్‌, మంత్రి అవంతి శ్రీనివాస్‌ మధ్య  జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది.

cm-jagan-avanti-funny-discussion-in-cabinet
'మంత్రులంతా శ్రీరామచంద్రులు కావాలి'
author img

By

Published : Nov 28, 2019, 6:19 AM IST

Updated : Nov 28, 2019, 7:27 AM IST

మంత్రి : మూడు నక్షత్రాల హోటళ్లలో బార్లకు లైసెన్స్‌ ఫీజు రూ.1.50 కోట్ల వరకు పెట్టారు. దీని ప్రభావం పర్యటకంపై పడుతుందని... సమస్యను పరిష్కరించాలని హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.

సీఎం : పర్యటకానికి ఏం ఇబ్బంది వస్తుంది ?

మంత్రి : ధరల వల్ల పర్యటకుల నుంచి ఆసక్తి కొరవడుతుందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

సీఎం : అన్నా.. మీరో.. నేనో.. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లేది... పర్యటక ప్రదేశాలు చూసి ఆస్వాదించేందుకు కానీ... గదిలో కూర్చొని తాగడానికి కాదు కదా? అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.

మంత్రి : మీరంటే శ్రీరామచంద్రుడు.... సత్యహరిశ్చంద్రుడు కాబట్టి మద్యం గురించి ఆలోచించరు.

సీఎం : మీరంతా కూడా శ్రీరామచంద్రులు కావాలి (ఇలా అనగానే అందరు నవ్వులు చిందించారు) పర్యటకం కోసం కాకుండా సమాజం కోసం ఆలోచించాలి. దశలవారీగా మద్య నిషేధం దిశగా వెళ్తున్నందున అవాంతరాలను అధిగమించాలి.

అనంతరం మ‌ద్యాన్ని నియంత్రించాలా వద్దా అంటూ సీఎం జగన్ మహిళా మంత్రులను అడగ్గా... వారంతా ముక్తకంఠంతో నియంత్రించాల్సిందేని అభిప్రాయపడ్డారు. బార్లలో పరిమితికి మించి నిల్వలుంటే వారి లైసెన్స్‌ ఫీజుపై రెండింతల అపరాధ రుసుం వసూలు చెయ్యాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక వినియోగ‌దారుడు 3 బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశాన్ని ఒక్కదానికే ప‌రిమితం చేయాల‌ని సీఎం వ్యాఖ్యానించారు. ఇలా చేసే కన్నా ఒకేసారి సంపూర్ణ మ‌ద్య నిషేధం అమ‌లు చేయాల‌ని ఒక మంత్రి చ‌మ‌త్కరించారు. ఇలా చేస్తే ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయని మరి కొందరు అమాత్యులు ప్రస్తావించారు.

ఇదీ చదవండి :

ఏపీలో తొలిసారిగా... గుర్రపు డెక్కకు డ్రోన్​తో చెక్..!

Last Updated : Nov 28, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.