ETV Bharat / city

మండలిపై రూపాయి ఖర్చైనా దండగే: సీఎం జగన్

ప్రజలు ఎన్నుకున్న  శాససభ ఆమోదించిన బిల్లులను సైతం రాజకీయ కారణాలతో మండలి అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అందుకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. ప్రజాప్రయోజనాలు పట్టని ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నామని చెప్పడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

మండలిపై రూపాయి ఖర్చైనా దండగే: సీఎం జగన్
మండలిపై రూపాయి ఖర్చైనా దండగే: సీఎం జగన్
author img

By

Published : Jan 28, 2020, 5:33 AM IST

Updated : Jan 28, 2020, 6:51 AM IST

ప్రజాప్రయోజనాలు పట్టని శాసనమండలిపై రూపాయి ఖర్చు చేసినా దండగేనని ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులను రాజకీయ కారణాలతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండలిని రద్దు చేస్తున్నామని...ఈ మాట చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాప్రయోజనాలు పట్టని మండలిని కొనసాగించడం, దానికోసం రాష్ట్ర ఖజనా నుంచి ఖర్చు చేయడం దండగని అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం శాసనసభకే జవాబుదారీతనంగా ఉంటుంది కానీ....మండలికి కాదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు శాసనసభ ఆమోదించిన బిల్లు మండలికి ఎందుకు వెళ్లాలనే ప్రశ్నకు సమాధానమే లేదన్నారు. ఈ మండలి వల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప మంచి జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు.

ఇక్కడే మేధావులు ఉన్నారు

మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగ రచన కమిటీ అనుకుని ఉంటే....దాన్ని రద్దు చేయడానికి వీళ్లేకుండా ఏర్పాటు చేసేదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే రెండోసభను శాసనసభ ఐచ్చికానికే వదిలేసిందని...ఆర్టికల్ 169 ప్రకారం రద్దు అధికారం అసెంబ్లీకే ఇచ్చేసిందన్నారు. దేశంలో విద్యావంతులు తక్కువగా ఉండి....మేధావులు, విజ్ఞులు అసెంబ్లీకి ఎన్నికయ్యే పరిస్థితులు లేనిరోజుల్లో ఎగువ సభలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం శాసనసభలో అలాంటి దుస్థితి లేదని....ముగ్గురు పీహెచ్​డీలు, 38 పీజీలు, 13 మంది వైద్యులు, 14 మంది ఇంజినీర్లు సహా ఎంతోమంది విద్యావంతులు, సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారని వివరించారు.

పార్టీ కన్నా.. ప్రజలే అవసరం

దేశంలో 6 రాష్ట్రాలు.. మినహా మిగిలిన అన్నిచోట్ల మండలిని రద్దు చేశాయని సీఎం గుర్తు చేశారు. 'మండలి కొనసాగిస్తే వచ్చే ఏడాదికల్లా వైకాపా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని తెలుసు. పార్టీ కన్నా ప్రజల అవసరాలే ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజాప్రయోజనార్థం తీసుకొస్తున్న బిల్లులను అడ్డుకున్న దృష్ట్యా, ప్రజాధనం వృథా దృష్ట్యా....మండలి రద్దుకు తీర్మానం చేసినట్లు' సీఎం జగన్ వెల్లడించారు.

అమరావతి రైతులకు ఏం అన్యాయం జరిగింది?
అమరావతి రైతులకు ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు వారిని రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. కౌలు కాలం 15 ఏళ్లకు పెంచామని, కూలీల పింఛన్లు రెట్టింపు చేశామన్నారు. అసైన్డ్ భూముల యజమానులకు మిగిలిన వారితో సమానంగా రిటర్న్​బుల్ ప్లాట్లు ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందన్న సీఎం....మోసపూరిత మాటలు కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏం చేయగలమో చెబుతున్నామన్నారు.

ఇదీ చదవండి: 'మేధావుల ఆలోచనలు వినియోగించుకునే అవకాశం కోల్పోయాం'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 28, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.