శాసన మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని... ఇప్పుడు జగన్ రద్దు చేయడం హేతుబద్ధంగా లేదని జనసేన భావిస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో... రాష్ట్రాభివృద్ధికి మేధావుల ఆలోచనలను ఉపయోగించే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. మండలిని రద్దు చేసే ప్రత్యేక పరిస్థితులేవీ రాష్ట్రంలో నెలకొనలేదన్నారు. శాసనసభలో ఏదైనా బిల్లుపై పొరపాటుగా నిర్ణయం తీసుకున్నప్పుడు... వాటిపై చర్చించడానికే శాసన మండలిని రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఇంతటి ఉన్నతాశయంతో ఏర్పాటైన మండలిని రద్దు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న జనసేనాని...శాసన మండలి రద్దుకు ప్రజల ఆమోదం ఉందా..? లేదా అనే అంశాన్ని ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం