ETV Bharat / city

సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. 36 మంది ఎంపిక - upsc results 2020

దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే... సివిల్స్ ఫలితాల్లో తెలుగు వారు సత్తా చాటారు. అద్భుతమైన ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మందికిపైగా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరికి ఐఏఎస్​, ఐపీఎస్​, ఐఎఫ్ఎస్​ తదితర సర్వీసులు దక్కే అవకాశాలున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది సివిల్స్‌కి ఎంపికయ్యారు.

civils tops in telugu states
సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
author img

By

Published : Aug 5, 2020, 12:13 AM IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో... తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత ప్రతిభ చాటింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావికి చెందిన శిక్షణ ఐపీఎస్ అధికారి పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌ రామంతపూర్‌కు చెందిన కట్టా రవితేజ 77వ ర్యాంకు సాధించారు.

హైదరాబాద్‌కు చెందిన సత్యసాయి కార్తీక్‌... అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే సివిల్స్‌లో 103వ ర్యాంక్ సాధించారు. సిద్దిపేటకు చెందిన మంద మకరంద్ ఆల్ ఇండియా 110వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ప్రేంసాగర్‌ 170వ ర్యాంకు, కరీంనగర్‌కు చెందిన గాయత్రి 427, జడ్చర్లకు చెందిన శశికాంత్ 764, హన్మకొండకు చెందిన స్మృతిక్ 466వ ర్యాంకు సాధించి విజేతలుగా నిలిచారు.

civils tops in telugu states
సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

ఇవీ చూడండి: దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.