దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో పలు ఉద్యోగ పరీక్షల కాలపట్టికను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్(ప్రాథమిక పరీక్ష) వచ్చే సంవత్సరం జూన్‌లో ఉంటుంది. మెయిన్ పరీక్షలను ఆ ఏడాది సెప్టెంబరులో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ సర్వీసెస్, ఎన్డీఏ, ఫారెస్ట్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ తదితర మొత్తం 24 ఉద్యోగ పరీక్షల తేదీలను ఖరారు చేసి యూపీఎస్సీ కాలపట్టికను జారీ చేసింది.
అలాగే సివిల్స్-2021 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది అక్టోబరు 10న, వాటి మెయిన్ పరీక్షలను వచ్చే జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2021 మెయిన్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 27వ తేదీన మొదలై మార్చి 8తో ముగుస్తాయి.
ఇదీ చూడండి: SCHOOLS REOPENING: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునః ప్రారంభం