ETV Bharat / city

"ఆ హీరో నా వెంటపడుతున్నాడు.. నేనూ ప్రేమిస్తున్నాను.." - movies effect on girls

నేను సినిమా చూసిన తర్వాత ఆ ప్రభావం వారం దాకా నాపై తీవ్రంగా ఉంటుంది. ఆ హీరో నా వెంట పడుతున్నట్టు.. మేం ప్రేమించుకుంటున్నట్టు ఊహల్లో తేలిపోతుంటా. అదే ట్రాజెడీ సినిమా అయితే నా బాధ ఆపడం ఎవరితరమూ కాదు. హీరో చనిపోతే ఏడుపాగదు. పదేపదే తలచుకొని కుమిలిపోతుంటా. అన్నం సహించదు. ఏ పనిపైనా ధ్యాస పెట్టలేను. నన్ను చూసి ఫ్రెండ్స్‌ నవ్వుతున్నారు. ఎంత ప్రయత్నించినా మారలేకపోతున్నా. ఎందుకిలా?

యువతి వేదన
యువతి వేదన
author img

By

Published : Nov 27, 2021, 3:08 PM IST

Updated : Nov 27, 2021, 3:14 PM IST

పై విధంగా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ యువతి! ఇదంతా ఏంటో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారా? కాస్త ఆగండి. పైన చెప్పినదంతా.. యుక్త వయసులో ఉన్న ఓ యువతి ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ.. అబ్బాయిలు కానీ.. సినీ తారలపై వ్యామోహం పెంచుకోవడం సహజమే. అయితే.. ఈ కథనంలోని యువతి ఆకర్షణ మాత్రం మీటరుకు అందకుండా ఉంది. అరుదుగా కొందరు ఇలాంటి భావనకు లోనవుతుంటారు. ఈ కోవకే చెందిన యువతి.. కౌన్సెలింగ్ కోరుతూ సైకాలజిస్టుకు రాసిన లేఖనే.. ఇప్పుడు మనం చదువుతున్నాం. దీనికి సైకాలజిస్టు ఏం చెప్పారంటే...

"మీ వయసెంతో తెలియజేయలేదు. సహజంగా యుక్త వయసులో ఇలాంటివి జరుగుతుంటాయి. చాలామంది అమ్మాయిలు తమని బాగా ప్రేమించే వ్యక్తి దొరకాలని, సినిమాల్లో హీరో, హీరోయిన్లలా తమ అనుబంధం ఉండాలని ఆశ పడుతుంటారు. తమ స్నేహితుల్లో ఎవరైనా అలాంటి ప్రేమికులు ఉంటే వాళ్లని రోల్‌మోడల్‌గా చూస్తారు. వాళ్లలా ఎంజాయ్‌ చేయాలని కలలు కంటుంటారు. సినిమాలు, సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఇలా ఊహల్లో తేలిపోతుంటారు. ఆ పాత్రల్లో తమని తాము ఊహించుకొని మురిసిపోతారు. నిజ జీవితంలో సాధ్యపడని వాటిని తెరపై తమకు కనెక్ట్‌ చేసుకొని సంతోషిస్తారు. ఇలా ఊహాజనిత ప్రపంచంలో ఉన్నవారికి తీవ్రమైన భావోద్వేగాలు కూడా మొదలవుతాయి. కానీ.. ఇదంతా ఊహ. నిజం కాదు. ఈ విషయాన్ని మీ మనసుకు అర్థం చేయించండి" అని చెప్పారు.

సంతోషం, బాధ.. అధికమవుతాయి. ఇలా జరగడానికి మన సబ్‌కాన్షియస్‌ మైండ్‌ కూడా ఓ కారణం. మనం ఏదైతే ఊహించుకుంటామో, దాన్నే మెదడు.. రియాలిటీగా భావించి శరీరానికి సమాచారం చేరవేస్తుంది. దానికనుగుణంగానే ప్రతిస్పందనలు కలుగుతాయి. అందుకే ఆ ఊహా ప్రపంచం నుంచి బయటికి రావాలి. సినిమా వేరు, జీవితం వేరు అని పదేపదే మననం చేసుకోండి. మీ స్నేహితులు ఎందుకు మీలా స్పందించడం లేదని అడగండి. వీలైతే సినిమాలు చూడటం తగ్గించుకోండి. సినిమా చూసిన తర్వాత ఆ ఆలోచనలు రాకుండా ఉండేందుకు తీరిక లేని పనులు పెట్టుకోండి. ఇవన్నీ చేస్తే.. తప్పకుండా మీరు ఆ ప్రభావం నుంచి బయటపడతారు. అయినా అది జరగడం లేదంటే ఒక మానసిక నిపుణుడిని సంప్రదించండి. ఆల్‌ ది బెస్ట్‌. - అర్చన నండూరి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

ఇవీ చదవండి :

TTD TICKETS: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. పది నిమిషాల్లోనే ఖాళీ..!

Last Updated : Nov 27, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.