టాలీవుడ్ మత్తుమందుల కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు సినీనటుడు రవితేజ హాజరయ్యారు. ఆయన డ్రైవర్, సహాయకుడు శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. నేడు విచారణకు రావాలని గతంలో రవితేజకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మత్తుమందుల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ విచారణ చేపడుతోంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు మత్తుమందుల సరఫరాదారు కెల్విన్ హాజరుకానున్నారు. కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ విచారణ కొనసాగుతోంది. కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానాను ఈడీ అధికారులు విచారించారు. వీరి నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి లావాదేవీలు తదితర అంశాలపై లోతుగా విచారించారు. ఇందులో భాగంగా ఇవాళ రవితేజను విచారణకు హాజరుకావాలని సూచించారు.
ఇదీ చదవండి: నరసరావుపేటలో నారా లోకేశ్ పర్యటనపై ఉత్కంఠ.. నేతల గృహనిర్బంధం