ETV Bharat / city

తెలంగాణ : మరియమ్మ కేసు... మరో పోలీస్ అధికారిపై వేటు - mariyamma case latest news

తెలంగాణలోని మరియమ్మ కేసులో... మరో పోలీసు అధికారిపై వేటు పడింది. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను కమిషనరేట్​కు అటాచ్​ చేస్తూ.. రాచకొండ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మ కేసుతోపాటు చౌటుప్పల్ ఏసీపీ పరిధిలో ఇటీవల కొన్ని కేసులు సంచలనంగా మారడం వల్ల... అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వేటు వేసినట్లు తెలుస్తోంది.

choutuppal-acp-sattaiah-attached-to-rachakonda-cp-office
మరియమ్మ కేసు... మరో పోలీస్ అధికారిపై వేటు
author img

By

Published : Jun 27, 2021, 4:59 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ మృతి కేసులో... నాలుగో పోలీసుపై వేటు పడింది. ఇప్పటికే ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్... తాజాగా చౌటుప్పల్ ఏసీపీని కమిషనరేట్​కు అటాచ్​ చేశారు. కాంగ్రెస్ నేతలు... ముఖ్యమంత్రిని, గవర్నర్ తమిళిసైని కలిసిన తర్వాత వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు... సంబంధిత పోలీసు అధికారుల్లో గుబులు రేపుతున్నాయి. చౌటుప్పల్ ఏసీపీ పి.సత్తయ్యను అటాచ్​ చేశాక... ఆయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్​కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే మరియమ్మ కస్టోడియల్ మృతి కేసులో... ఎస్ఐ మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై సస్పెన్షన్ వేటు పడింది.

నిర్లక్ష్యం వల్లే

చౌటుప్పల్ ఏసీపీ పరిధిలో కొద్దికాలంగా పలు కేసులు... సంచలనంగా మారాయి. ఇవన్నీ సత్తయ్యపై చర్యలకు కారణంగా నిలిచాయి. రామన్నపేటలో క్షుద్రశక్తుల పేరిట ఇటీవల మహిళ నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్న ముఠాపై నిర్లక్ష్యం వహించారంటూ... సీఐ శ్రీనివాస్, ఎస్సై చంద్రశేఖర్​ను సస్పెండ్ చేశారు. భూవివాదంలో తలదూర్చినందుకు ఆర్నెల్ల క్రితం చౌటుప్పల్ సీఐ వెంకన్నగౌడ్, ఎస్సై నర్సయ్యపై చర్యలు తీసుకున్నారు. ఆ వివాదం విషయంలో ఏసీపీ సత్తయ్యకు... మెమో జారీ అయింది. 20కి పైగా కేసులున్న అంతర్​రాష్ట్ర గజ దొంగ తప్పించుకున్న ఘటనలో... అదే ఠాణాలో ఏఎస్సైతోపాటు కానిస్టేబుల్ సస్పెండయ్యారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతి, యువకుడి వద్ద డబ్బుల వసూలుకు యత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్​కు గురయ్యారు.

చౌటుప్పల్ ఏసీపీ పరిధిలోని పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు... అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో వరుసగా సిబ్బందిపై వేటు పడుతోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీపీ... తాజా కేసుతో కలిపి ఏసీపీపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి:ఆ ఎమ్మెల్యే మాటలతో ఏకీభవిస్తున్నా!: సీపీఐ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.