ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయంలో ఇకపై తాకకుండానే తనిఖీలు - airport after the lock down

విమానాశ్రయాల నుంచి నిత్యం లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారు. లాక్​డౌన్​ అనంతరం అన్ని దశల్లోనూ ప్రయాణికులను తనిఖీలు చేయడమన్నది ఓ సవాల్​గా మారింది. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది..

checks-without-touching-passengers-at-the-airport-after-the-lock-down
శంషాబాద్ ఎయిర్​పోర్టులో తాకకుండానే తనిఖీలు
author img

By

Published : May 10, 2020, 12:41 PM IST

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించేందుకు హైదరాబాద్​లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రయాణికులను లోనికి అనుమతించేలా అధికారులు ఏర్పాటు చేశారు. తనిఖీల సమయంలో గుర్తింపు పత్రాలు, ఎయిర్‌టికెట్‌ను భద్రతా సిబ్బంది చేతికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశీలించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక మీదట సెక్యూరిటీ సిబ్బంది ఆయా పత్రాలను చేతితో ముట్టుకోకుండా తనిఖీ చేయనున్నారు. ఇందుకుగాను ప్రవేశ ద్వారం వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు గుర్తింపు కార్డు, ఎయిర్‌టికెట్‌ను ఆ కెమెరా ముందు ఫ్లాష్‌ చేయాలి. ఎదురుగా సెక్యూరిటీ పాయింట్‌లో ఉన్న తెరపై ఆయా పత్రాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించి నిర్ధారించుకున్నాక వారిని లోనికి అనుమతిస్తారు.

శరీర ఉష్ణోగ్రత గుర్తించే థర్మల్‌ కెమెరాలు

టెర్మినల్‌లోకి ప్రవేశించగానే ప్రయాణికుల ముఖం, శరీర ఉష్ణోగ్రతలను గుర్తించేందుకు వీలుగా థర్మల్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉంటేనే అనుమతిస్తారు. అలాగే ప్రవేశద్వారం వద్ద సెన్సార్‌ సాయంతో పనిచేసే ఆటోమేటిక్‌ శానిటైజర్‌ను ఉంచారు. ప్రయాణికులు తాకకుండానే చేతులను శుభ్రపరుచుకునే వీలుంది. ఇకపై ప్రతి ప్రయాణికుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

ఇదీ చదవండి:

విషాదం: గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.