ETV Bharat / city

తక్కువ ఓల్టేజి సమస్యలకు చెక్​ పెట్టాలి: సీఎస్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కేంద్రం అమలు చేస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. తక్కువ ఓల్టేజి సమస్యలతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎస్ సుబ్రమణ్యం
author img

By

Published : Oct 3, 2019, 8:45 PM IST

డీడీయూజీజేవై పథకంపై సీఎస్ సమీక్ష

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లోడును మెరుగు పర్చటం, ఓల్టేజి సమస్యను అధిగమించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీజేవై) పథకం కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఈ పథకంపై రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మంచి ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వినియోగదారులు స్టెబిలైజర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కచ్చితంగా హామీ ఇచ్చే రీతిలో వివిధ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి పూర్తి భరోసాను ఇచ్చేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ప్రాజెక్టు చేపట్టటం ద్వారా ఎంతవరకూ ప్రయోజనం కలుగుతుంది అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎస్ సుబ్రమణ్యం ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకం అమలుకు సంబంధించి రూ.521.54 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వివిధ పనులకు ఇప్పటికే 404 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. మిగతా 117 కోట్ల 54 లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో అదనంగా 33/11 కేవీ సామర్థ్యంతో 66 ఉప విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు.

Intro:ap_atp_51_03_road_accident_av_ap10094Body:అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గం
చెన్నేకొత్తపల్లి మండలం n s గేట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై బళ్లారి నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు (స్కార్పియో KA 34 M 2404 ) అదుపుతప్పి బోల్తా స్కర్పియో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.