రాష్ట్రంలో కొందరు అధికారుల హోదాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ.సత్యనారాయణ హోదాను ఆర్ధికశాఖలో కార్యదర్శిగా మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సాధారణ పరిపాలనశాఖలో ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉంటారని పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై .మధుసూధన్ రెడ్డిని ఆ శాఖలోనే ముఖ్యకార్యదర్శిగా హోదాలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి. వ్యవసాయ విద్యుత్ రాయితీకి 409 కోట్ల రూపాయలు..