రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. అజిత్సింగ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. అజిత్సింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రిగా ఎనలేని సేవలందించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అజిత్సింగ్ సంస్కరణలు రైతులకు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వానికి అజిత్సింగ్ కృషి అజరామరం అని చంద్రబాబు కొనియాడారు.
ఇదీ చదవండి: కరోనాతో ఆర్ఎల్డీ చీఫ్ మృతి- మోదీ సంతాపం