CHANDRABABU: కొత్త సంవత్సరం పార్టీ శ్రేణులకు లక్ష్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కార్యాచరణ... తదితర అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నియోజకవర్గ ఇంఛార్జిలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించనున్న చంద్రబాబు...4, 5 తేదీల్లోనూ కేటగిరీల వారీగా సమావేశాలు పెట్టనున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉన్న 22 పురపాలక సంఘాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్య నేతలతో 4న సమావేశం జరుగుతుంది.
ఈ నెల 5న 175 శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, 25 లోక్‌సభ స్థానాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు. ఈ నెల 6 నుంచి 3 రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. స్థానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజల్ని కలుస్తారు. 11, 12, 13తేదీల్లో తిరిగి అమరావతి కేంద్రంగా రాజకీయ సమీక్ష లు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: TTD Priests blessings: రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు తితిదే వేద పండితుల ఆశీర్వాదం