ముస్లిం సోదరులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగనును జరుపుకుంటారని చంద్రబాబు గుర్తు చేశారు. భక్తి భావం, కరుణ, సహనాన్ని బక్రీద్ చాటి చెబుతుందన్నారు. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని, మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీయమన్నారు.
బక్రీద్.. దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం, పేదల పట్ల సాయం, ఇతరుల పట్ల సోదర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఇస్లాం మతంలోని మానవతావాదాన్ని, పేదలకు సాయం చేయాలన్న గొప్ప సందేశాన్ని అందించే పండుగ బక్రీద్ అని లోకేశ్ స్పష్టం చేశారు. ముస్లిం కుటుంబ సభ్యులకు అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నామన్నారు.
ఇవీ చదవండి..
నెల్లూరు జీజీహెచ్ మారని పరిస్థితులు... మా తప్పు లేదన్న అధికారులు