రాజధాని మార్పు తగదు
రాజధాని రైతులకు తెలుగుదేశం అండగా ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు తగదన్న హితవు పలికిన చంద్రబాబు 5 కోట్ల ప్రజలకు ఒక రాజధాని అవసరమని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో తనను కలసిన నీరుకొండ గ్రామ రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. అమరావతికి ఖర్చు ఎక్కువనేది అవాస్తం అన్న చంద్రబాబు ఖర్చులేని రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టామని వివరించారు.
వరద ముంపు తప్పించడానికే కొండవీటి వాగు
ఎన్నికల ఫలితాల తర్వాత రాజధానిపై మాజీ మంత్రి నారాయణ తొలిసారి మాట్లాడారు. రాజధానికి వరద వచ్చే అవకాశమే లేదని నారాయణ స్పష్టం చేశారు. వరద ముంపు ఉండకూడదనే కొండవీటి వాగు ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన అన్నారు. 6 రిజర్వాయర్లు ద్వారా రాజధానిలో నీటిని క్రమబద్ధతిలో బయటకు పంపేలా ప్రణాళిక చేశామన్నారు.
అసత్య ప్రచారం
రాజధానిపై మంత్రి బొత్స చేస్తోన్న వ్యాఖ్యలపై రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఇంత వరకూ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని వారు ఆరోపించారు. రైతులకు కౌలు చెల్లించకుండా... తమ భూముల్లో నిర్మించిన సచివాలయంలో మంత్రులు ఎలా కూర్చుంటారని రైతులు ప్రశ్నించారు. అమరావతిలో అవినీతి అంటూ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. నదుల పక్కనే ఉన్న నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయన్న చంద్రబాబు ఏదోరకంగా అమరావతిని అడ్డుకోవాలని వైకాపా ప్రయత్నిస్తుందని విమర్శించారు.
ఇదీ చదవండి :