ETV Bharat / city

"చలో కంతేరు.." పిలుపునిచ్చిన చంద్రబాబు - cbn Chalo Kantheru

Chandrababu Call Chalo Kantheru: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు మొదట తల్లిపై దాడి..!ఇప్పుడు కుమారుడిపైనా దాడి..! .అడ్డుకున్నందుకుఆమెపైనా కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇవీ గుంటూరు జిల్లా కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైకాపా కార్యకర్తల దాష్టీకాలు !. ఆదివారం జరిగిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. దాడికి నిరసనగా చలో కంతేరుకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డీజీపికి లేఖ రాశారు.

babu
babu
author img

By

Published : Jun 12, 2022, 7:33 PM IST

Updated : Jun 13, 2022, 2:38 AM IST

Guntur News: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి అధికార పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారు. వైకాపాకు చెందిన నల్లపు సునీత..వెంకాయమ్మపై పాత గొడవల కారణంగా తిట్ల దండకం నిత్యకృత్యమైంది. అయితే ఆమె తిట్లను రికార్డు చేయాలంటూ వెంకాయమ్మ తన కుమారుడికి సూచించింది. ఈ క్రమంలో గమనించిన సునీత.. అతన్ని వెంబడించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో కంతేరులో వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై నల్లపు సునీత వర్గం కర్రలతో దాడి చేసింది. దాడిలో గాయపడ్డ వెంకాయమ్మ కుమారుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వంశీపై వైకాపా నేతల దాడిని ఖండిస్తూ తెలుగుదేశం నేతలు నక్కా ఆనందబాబు, ఇతర నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈలోగా అక్కడికి వైకాపా శ్రేణుల చేరికతో చాలాసేపటి వరకూ ఘర్షణ వాతావరణం కొనసాగింది. దాడి తీరుపై వెంకాయమ్మ కుమారుడు పోలీసులకు వివరించాడు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈమేరకు డీజీపీకి లేఖ రాశారు. కొందరు పోలీసుల సహకారంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. ఎస్సీ కుటుంబంపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు.. నేడు చలో కంతేరుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ పార్టీ నేతలు కంతేరు వెళ్లనున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ నేత నక్కా ఆనందబాబు ప్రకటించారు.

ఏం జరిగిందంటే..?
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో.. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మపై మరోసారి అధికార పార్టీ నాయకులు దాడి చేశారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... వైకాపాకు చెందిన నల్లపు సునీత వర్గీయులు.. పాత గొడవలను మనసులో పెట్టుకొని వెంకాయమ్మను నిత్యం దూషిస్తున్నారు. ఈ క్రమంలో.. వారి దుషణలను ఫోన్లో రికార్డు చేయాలని వెంకాయమ్మ తన కుమారుడికి సూచించింది. దీంతో.. ఆమె కుమారుడు ఫోన్లో రికార్డు చేస్తుండగా.. నల్లపు సునీత గమనించి వెంబడించింది. ఇది గమనించిన వెంకాయమ్మ కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో కంతేరు గ్రామ వాటర్ ట్యాంక్ వద్ద.. ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై నల్లపు సునీత వర్గీయులు కర్రలతో దాడిచేశారని బాధితులు తెలిపారు. ఈ గొడవపై ఇరు వర్గాలూ పోలీసులను ఆశ్రయించాయి.

ఇవీ చదవండి :

  • వృద్ధురాలిపై ఏనుగు పగ.. అంత్యక్రియల్లోనూ దాడి
  • పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు.. బండ్లు రెడీ..!

Last Updated : Jun 13, 2022, 2:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.