ETV Bharat / city

Chandrababu letter to CM: 'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి' - ఏపీ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) లేఖ రాశారు. దాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని.. వెంటనే వాటిని చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. రైతు(Farmers) ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే వాళ్ళమని గుర్తు చేశారు.

chandrababu letter
chandrababu letter
author img

By

Published : Jun 17, 2021, 7:34 AM IST

Updated : Jun 17, 2021, 3:54 PM IST

రైతులకు (Farmers) ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ..సీఎం జగన్​కు(CM Jagan) తెదేపా అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu Naidu) లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించక రైతులు నష్టపోతున్నారన్నారు. మద్దతు ధరకు కొనుగోలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. రైతులను నిండా ముంచే విధానాలు అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వంలో 48 గంటల్లోనే నగదు జమ చేశామని.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు చేసి 2 నెలలు దాటినా అతీగతీ లేదని విమర్శించారు. అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు అమ్మిన ధాన్యం డబ్బులు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విక్రయించిన రైతుల ధాన్యానికి నగదు జమకాలేదని..,గోదావరి జిల్లాల్లోనే రూ. 2500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు.

అన్నదాతలను ఆదుకోవాలి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగట్లేదని చంద్రబాబు(Chandrababu) లేఖలో విమర్శించారు. ప్రభుత్వం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి 27.87లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందన్నారు. ధాన్యం ఏ- గ్రేడు రకం క్వింటాల్ ధర రూ. 1,888, సాధారణ రకం రూ. 1,868 ఉండగా బయట మార్కెట్‌లో ధాన్యం 11వందల నుంచి రూ. 1350కు కొనుగోలు చేస్తున్నందున రైతులు రూ. 300 నుంచి 800 వరకు నష్టపోతున్నారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బీపీటీ-54 రకం ధాన్యం 75 కిలోల బస్తాను రూ. 1050కు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి విపత్తుల వల్ల రాయలసీమలో వేరుశనగ పంటకు తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. రైతులకు ఇన్​పుట్ సబ్సీడీ చెల్లించకపోగా ఎప్పుడిస్తారో వెల్లడించలేదని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

కష్టాల సుడిలో కౌలు రైతులు

ప్రభుత్వ చేతగానితనం వల్ల 16 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులకు (Farmers) ఎలాంటి సాయమూ అందట్లేదని చంద్రబాబు(Chandrababu) మండిపడ్డారు. సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, రైతు భరోసా, ఇన్​పుట్ సబ్సిడీ చెల్లింపుల్లోనూ తీవ్రంగా నష్టమే జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన గుర్తింపు కార్డులను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. 16 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పి, ఆ సంఖ్యను 41 వేలకు కుదించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్థత చర్యలతో కౌలు రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు పంటలు పండించిన రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టమోట, మామిడి, జొన్న, మొక్కజొన్న, అరటి, మిర్చి, కొబ్బరి, సుబాబుల్, రొయ్యలు సాగుచేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదని ఆక్షేపించారు.ఇప్పటికైనా పంటలకు మద్దతు ధర కల్పించి తక్షణ చెల్లింపులు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

property tax: ఆస్తి పన్ను పెరుగుతుంది:మంత్రి బొత్స

Last Updated : Jun 17, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.