తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. అరగంటపాటు చంద్రబాబు అక్కడే ఉన్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు అప్పటికే పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు రేణిగుంట చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆంక్షలు విధించిన పోలీసులు.. ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు.
ఇదే విషయం చెబుతూ.. చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు... చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరంచెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: