ETV Bharat / city

'వైకాపా ధన దాహంతో.. కార్మికులు రోడ్డున పడ్డారు' - cm jagan

కార్మికులకు అండగా తెదేపా శ్రేణులు పోరాటం చేస్తుంటే... వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే... ఊరుకోమన్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు ట్విటర్​ వేదికగా విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Aug 30, 2019, 9:18 PM IST

భవన నిర్మాణ కార్మికులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెదేపా వారి తరపున పోరాడుతుందని ఉద్ఘాటించారు. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు... ఒక్కో కుటుంబానికి రూ.60వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200 ఉంటే... వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో రూ.10వేలు చేసిందని విమర్శించారు.

వైకాపా నేతలు ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ల ధన దాహంతో 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. సిమెంట్ బస్తాకు రూ.10 జె-ట్యాక్స్ కట్టే వరకూ... ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇసుకపై ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను అభినందించారు.

చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండీ... 'ఆంధ్రాబ్యాంక్​'... ఇక కనపడదు

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 30-08-2019 Slug:AP_Atp_24_30_thief_catching_police_Avb_ap10176 anchor:- అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలో గత జూన్ నెలలో జరిగిన పలు చోరీల కేసులను పోలీసులు చేదించారు. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు బాలురు ఘర్షణ పడుతుండగా అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో పలు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది.దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆఇద్దరు బాలుర వద్ద నుండి 12 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండిని స్వాధీన పర్చుకున్నారు. వీటి విలువ మొత్తం సుమారు 3 లక్షల 50 వేల రూపాయల విలువ చేస్తుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతరం చోరీలకు పాల్పడిన ఇద్దరు బాలురును కోర్టు హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అనంతరం చోరీ కేసులపై పురోగతి సాధించిన సీఐ రాజశేఖర్ రెడ్డి ,యస్.ఐ ల తో పాటు తోటి పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. బైట్ : శ్రీనివాసులు (డి.యస్.పి.తాడిపత్రి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.