'రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు జగమొండితనం శాపం అయ్యిందని' తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధిని రివర్స్ చేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని... దాని ఫలితమే ఈ అప్రకటిత కరెంట్ కోతలని ట్విట్టర్‌లో విమర్శించారు. కేంద్రం తోడ్పాటుతో తెదేపా ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్‌ను కూడా రివర్స్ చేసేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ ఇస్తామన్న వైకాపా ప్రస్తుతం అందులో సగానికి కోసేసిందని ధ్వజమెత్తారు. పీపీఏలను మూర్ఖంగా రద్దుచేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారమన్నారు. థర్మల్ విద్యుత్ ఆధారపడదగింది కాదని పైగా పర్యావరణ హితం కూడా కాదని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాలు ముందే ఊహించి తాము సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించామని గుర్తు చేశారు. "తనకు తెలియదు, ఇతరులు చెబితే వినరు" అంటూ జగన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
నిరంతర విద్యుత్‌నూ రివర్స్ చేసేశారు: చంద్రబాబు - no current
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏలను రద్దు చేసిన దుష్ఫలితమే ఏపీలో అంధకారానికి కారణమన్నారు. రైతులకు 9 గంటలు నిరంతర విద్యుత్ ఇస్తామన్న వైకాపా ఇప్పుడు సగానికి కోసేసిందని ధ్వజమెత్తారు.
'రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు జగమొండితనం శాపం అయ్యిందని' తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధిని రివర్స్ చేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని... దాని ఫలితమే ఈ అప్రకటిత కరెంట్ కోతలని ట్విట్టర్‌లో విమర్శించారు. కేంద్రం తోడ్పాటుతో తెదేపా ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్‌ను కూడా రివర్స్ చేసేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ ఇస్తామన్న వైకాపా ప్రస్తుతం అందులో సగానికి కోసేసిందని ధ్వజమెత్తారు. పీపీఏలను మూర్ఖంగా రద్దుచేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారమన్నారు. థర్మల్ విద్యుత్ ఆధారపడదగింది కాదని పైగా పర్యావరణ హితం కూడా కాదని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాలు ముందే ఊహించి తాము సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించామని గుర్తు చేశారు. "తనకు తెలియదు, ఇతరులు చెబితే వినరు" అంటూ జగన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
k.veerachari, 9948047582
నేడు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ప్లాస్టిక్ నియంత్రణ ప్రజా చైతన్యంతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వి రమణరాజు తెలిపారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఈనాడు ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో భూ కాలుష్యం పెరుగుతోందని, మానవ జీవన విధానంలో ఆరోగ్యపరమైన పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. పూర్వం ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోని సంచులు, వస్త్ర సంచులను వినియోగించేవారని చెప్పారు. ఇప్పుడు ఏక వినియోగ ప్లాస్టిక్ సంచుల వల్ల వాతావరణం కలుషితం అవుతోందని భూ కాలుష్యం పెరిగి భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయని చెప్పారు. ఈ
పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడమే ఏకైక మార్గమని తెలిపారు విద్యార్థులు సంపూర్ణ అవగాహనతో తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట్ రెడ్డి, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Body:ఈనాడు ఈటీవి భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ పై సదస్సు
Conclusion:1. ప్రిన్సిపల్ రమణరాజు
2. అధ్యాపకుడు వెంకటరెడ్డి
3. విద్యార్థిని రెడ్డి పరమేశ్వరి
4. విద్యార్థి వెంకటేష్