రాజకీయ లబ్ది కోసం తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా జగన్ వాడుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తితిదే ఆస్తుల అమ్మకంపై తీర్మానాన్ని ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య బలపరిచారు.
వైకాపా పాలనలో తితిదే భక్తి, పవిత్రత రెండూ పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తూనే కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారని మండిపడిన ఆయన... తమ వద్ద ఉందని ఆరోపించిన పింక్ డైమండ్ విచారణ నివేదిక ఏమైందో బయట పెట్టాలని డిమాండ్‌చేశారు. నాడు ఏడుకొండలు కాదు రెండుకొండలే అని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విమర్శించగా... నేడు జగన్ కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: