ETV Bharat / city

రాష్ట్రం పరువు తీసే నిబంధన అది.. సిగ్గు చేటు : చంద్రబాబు

టెండర్ల నిబంధనల్లో కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లకూడదన్న నిబంధనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ నిబంధన రాష్ట్ర పరువు తీసేలా ఉందని మండిపడ్డారు. జగన్‌ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. దాని ప్రభావమెంతో ఆలోచించారా? అని ధ్వజమెత్తారు. ధైర్యంగా టెండర్లు పిలవలేని ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Jun 3, 2022, 10:28 AM IST

Updated : Jun 3, 2022, 12:16 PM IST

కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల బిల్లుల పెండింగ్​లో పెట్టడం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని మండిపడ్డారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్​లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. జగన్ సర్కారు మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్​లోనే నిబంధన పెట్టడం... రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు.

కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్​లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని ఆక్షేపించారు. పాలకులకు ఇది సిగ్గుగా అనిపించిందో లేదో కానీ... రూ.13 కోట్ల టెండర్ పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదంటూ నిబంధన పెట్టే హక్కు అసలు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిన ముఖ్యమంత్రిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళ తీయడం సమాజంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు.

రూ.13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం... ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా అని నిలదీశారు. ఎయిర్​పోర్టులు, స్టీల్ ప్లాంట్ల నిర్మాణం, మూడు రాజధానులు అన్నీ ఇలాంటి నిబంధనలతోనే చేస్తుందా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వైఫల్యం కారణంగా ఏపీ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. ఎవరి బతుకు వారు బతికే పరిస్థితి కూడా లేకుండా చేయడం సంక్షేమమా? అని ధ్వజమెత్తారు. కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చేయడం అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. అభివృద్ది వైపు ప్రయాణించే రాష్ట్రాన్ని అంధకారం వైపు జగన్ నెట్టేశారని అన్నారు. తద్వారా.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. చీరాలలో పనులకు సంబంధించి టెండర్‌ కాపీని చంద్రబాబు మీడియాకు విడుదల చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 3, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.