ETV Bharat / city

సుప్రీం తీర్పు కంటే... ముఖ్యమంత్రి మాటే మీకెక్కువా? : చంద్రబాబు - Chandrababu Fire on Ycp govt

"వివేకానందరెడ్డిని చంపినా దిక్కులేదు కాబట్టి.. ఎవరినైనా చంపొచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా?" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కులాల్ని రెచ్చగొట్టారని రఘురామ కృష్ణరాజుపై కేసు పెట్టిన సీఐడి... వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కులాన్ని అంటగట్టిన ముఖ్యమంత్రిపై కేసు ఎందుకు పెట్టి అరెస్ట్ చెయ్యలేదని నిలదీశారు. సీఎస్ గా పదవీవిరమణ చేసి.. ఎస్ఈసీ పదవి కోసం కక్కుర్తిపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా అని నీలం సాహ్నీని ఉద్దేశించి చంద్రబాబు మండిపడ్డారు.

ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు

author img

By

Published : May 22, 2021, 1:52 PM IST

Updated : May 23, 2021, 5:10 AM IST

పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను 8 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని, దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునూ బేఖాతరు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి ఆ పదవిలో ఒక్క నిమిషం కొనసాగేందుకూ అర్హత లేదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఇంగ్లిషు చదవడం, రాయడం వచ్చిన సాధారణ వ్యక్తులకూ సుప్రీంకోర్టు తీర్పు తేలిగ్గా అర్థమవుతుందని, సీఎస్‌గా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం అర్థం కాదా? అని హైకోర్టు ఆక్షేపించింది. ఆమె ఉద్యోగం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రూ.160 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎన్నికల సంఘానికి స్వతంత్ర సంస్థగా వ్యవహరించే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఈ ప్రభుత్వంలో సీఎస్‌గా, సలహాదారుగా పనిచేసిన వ్యక్తి, ఎస్‌ఈసీ పోస్టులోకి వెళ్లి... ప్రభుత్వం చెప్పిందని ఇష్టప్రకారం చేశారు. ఎన్నికల రద్దుతో వృథా అయిన రూ.160 కోట్లు ఎస్‌ఈసీ కడతారా? సీఎం కడతారా? సుప్రీంకోర్టు ఉత్తర్వులకే దిక్కు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితేంటి? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల మాటేంటి?’ అని శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు ధ్వజమెత్తారు.

‘నీలం సాహ్నిని సీఎస్‌గా ఏరికోరి తెచ్చుకున్నారు. ఆమె పదవీవిరమణ చేశాక సలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌ని చేశారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టిన రోజే మా పార్టీ తరఫున వర్ల రామయ్య వెళ్లి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకోవాలని, వెంటనే ఎన్నికలు పెట్టొద్దని కోరారు. ఆమె సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారు. అలా చేయడం చెల్లదని ఇప్పుడు హైకోర్టు తీర్పు చెబితే... దానిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే వీళ్లు ఏ దుర్మార్గాలు చేసినా కోర్టులు సమర్థించాలా? భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన, చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. కోర్టులు ఇచ్చే ఆదేశాల్ని అమలుచేయడం వరకే ప్రభుత్వం బాధ్యత. తప్పుబట్టే అధికారం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఈ ముఖ్యమంత్రిది రాజద్రోహం కాదా?
‘వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టారన్న అభియోగం మోపి, రాజద్రోహం నేరం కింద అక్రమంగా అరెస్టుచేశారు. మరి మీ ముఖ్యమంత్రి చేసిందేంటి? ఎన్ని కులాల్ని తిడుతున్నారు? చివరకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న వారికీ కులముద్ర వేశారు. సీఎంపై రాజద్రోహం కేసు ఎందుకు పెట్టరు? ధైర్యముంటే ముందు మీ ముఖ్యమంత్రిపై చర్య తీసుకోండి. చట్టాల్ని ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తే పోలీసులూ శిక్షార్హులవుతారు’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్‌ నన్ను తిడుతూ... నడిరోడ్డుపై ఉరేయాలని, చెప్పులతో కొట్టాలని, కాల్చి చంపాలని, బంగాళాఖాతంలో పడేయాలని నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. అది రాజద్రోహం కాదా? మీతో విభేదించినందుకు మీ పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు అని కూడా చూడకుండా అరెస్టు చేశారు. అది పైశాచిక ఆనందం కాకపోతే ఏంటి? పోలీసు కస్టడీలో ఉన్న ఎంపీని కాళ్లు కట్టేసి కొట్టారు. ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోర్టు చెప్పినా వినకుండా... దొడ్డిదారిన జైలుకి తరలించారు. వైకాపా నాయకుడి భార్య ఆధ్వర్యంలో మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్టు ఇప్పించారు. ఎంపీ తనని తానే కొట్టుకుని, గాయపరుచుకున్నారని అడ్వకేట్‌తో చెప్పించారు. వివేకానందరెడ్డిని చంపినా దిక్కులేదు కాబట్టి ఎవర్నైనా చంపేయొచ్చనుకుంటున్నారా?’ అని చంద్రబాబు నిలదీశారు. ‘విశాఖకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌ మాస్కు అడిగిన నేరానికి కేసు పెట్టి, రోడ్డుపై పడేసి కొట్టి, పిచ్చాసుపత్రిలో చేర్చి, తప్పుడు మందులు ఇచ్చి భయభ్రాంతుడిని చేశారు. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా... ఇంతవరకూ ఆయనకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం జీతం కూడా ఇవ్వడం లేదన్న మనోవేదనతో, బాధతో ఆయన చనిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఇప్పుడు దిక్కెవరు? ఎస్సీ వర్గానికి చెందిన ఆయనకు అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఉద్యోగం వచ్చింది. అదే రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును ఆయన కాపాడుకోలేకపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు
కృష్ణపట్నం మందుపై ఏమిటీ నాటకాలు?‘నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య వైద్యంతో కరోనా రోగులకు వ్యాధి తగ్గిస్తానని చెప్పినప్పుడు... ఈ పాలకులు ఆడిన నాటకాలు చూస్తే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతుంది. ఆయుర్వేద మందు విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఉన్నపళంగా దాని పంపిణీ ఆపేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మర్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి మందు పంపిణీ కొనసాగుతుందని ప్రకటించి, ఆయనే ప్రారంభించారు. వ్యాధి నయమవుతుందన్న ఆశతో 20-30 వేల మంది గుమిగూడారు. సాయంత్రానికి మందు పంపిణీ చేయడానికి వీల్లేదని ప్రకటించారు. ఇది చేతగాని ప్రభుత్వం. శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎమ్మెల్యే ఎవరు? కలెక్టర్‌ చెప్పాక... నిజనిర్ధారణ జరగాలి. మందు పనిచేస్తే ప్రోత్సహించాలి. అంతేతప్ప కలెక్టర్‌ ఎవరు చెప్పడానికి అని ఎమ్మెల్యే అంటే... ఈ ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?’ అని మండిపడ్డారు.

మనుషులు చనిపోతుంటే.. సహజీవనం చేయాలనడమేంటి?

‘కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒకపక్క మనుషులు చనిపోతుంటే... కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని సీఎం అనడమేంటి? అసలు కరోనా అన్నది లేనట్టే ఈ సీఎం ప్రవర్తిస్తున్నారు. కరోనాతో ఆప్తుల్ని కోల్పోయి వేల కుటుంబాలు బాధపడుతుంటే... ఈ ప్రభుత్వానికేమీ పట్టదా? ఒక్క అఖిలపక్ష సమావేశమైనా పెట్టారా? టీకాల కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు పెడతారా? అది ఏ మూలకు సరిపోతుంది? మిగతా రాష్ట్రాలు ముందే ఆర్డర్లు పెట్టి, డెలివరీ కూడా తీసుకుంటే... ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎవరైనా మాట్లాడితే దాడులు చేయిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు’ అని చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య ఇచ్చే కరోనా మందు మంచిదా? కాదా?

Last Updated : May 23, 2021, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.