తెగువకు, త్యాగానికీ నిర్వచనమైన యువత... రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ హక్కుల్ని యువత పోరాడి సాధించుకోవాలన్నారు. దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తుకు దిక్సూచి అయిన యువతీ యువకులకు చంద్రబాబు.. అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువత అభ్యున్నతే దేశాభ్యున్నతి అనేలా.. తెలుగుదేశం ప్రభుత్వం అడుగులేసిందని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్ధులకు విదేశీ విద్యా అవకాశాలు అందించామని, నెల నెలా నిరుద్యోగులకు భృతి అందించామని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో అండగా నిలిచామన్న చంద్రబాబు.. పెట్టుబడులను ఆహ్వానించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లుగా కొత్తగా పైసా పెట్టుబడి రాలేదన్న ఆయన.. పరిశ్రమలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని మండిపడ్డారు.
యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు సీఎం జగన్ బతుకు లేకుండా చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు లోకేశ్ అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా పాలనలో తెలుగు యువత ఎన్నో అద్భుత అవకాశాలను అందుకుందని, దేశ విదేశాల్లో తన సత్తా చాటిందన్న ఆయన.. అలాంటి యువశక్తిని రెండేళ్ళ జగన్ రెడ్డి పాలన తీవ్రంగా నిరుత్సాహపరిచిందని మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే తట్టుకోలేని యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉద్యోగాలు లేక బతుకు మీద భయంతో మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
GSLV: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలం.. క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య