ETV Bharat / city

కక్ష సాధింపులో భాగమే.. కొల్లు రవీంద్ర అరెస్టు: చంద్రబాబు

author img

By

Published : Jul 3, 2020, 10:25 PM IST

వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

chandrababu comments on kollu ravindra arrest
తెదేపా అధినేత చంద్రబాబు

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని.. తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు... వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా ఇలాంటి చర్య తీసుకోవడం.. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

కావాలనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్న చంద్రబాబు... ప్రతిపక్షాలను ఇంతలా టార్గెట్ చేసిన నేతలెవరూ గతంలో లేరన్నారు. ప్రతీకారేచ్ఛతో ప్రభుత్వం చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

సంబంధిత కథనం:

'మోకా' హత్య కేసు: పోలీసుల అదుపులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.