ETV Bharat / city

ఆ విషయంలో పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: చంద్రబాబు - chandrababu latest tweets

పాలకులు శాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు, సీఐడీపై కోర్టు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

chandrababu
chandrababu
author img

By

Published : Sep 12, 2020, 10:51 PM IST

  • పాలకులు శాశ్వతం కాదు. వ్యవస్థలు శాశ్వతం. దీని గురించి ఇదివరకే చాలాసార్లు చెప్పాను. దాదాపు ఇదేమాట ఇప్పుడు న్యాయస్థానం కూడా చెప్పింది. పాలకుల మెప్పుకోసం "ఖాకిస్టోక్రసీ" ప్రదర్శిస్తున్నారని సిఐడిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది అంటే.. పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. pic.twitter.com/3Zac6UWl8a

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాలకులు శాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాను ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని....ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. పాలకుల మెప్పు కోసం 'ఖాకిస్టోక్రసీ' ప్రదర్శిస్తున్నారని సీఐడీని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు చేసిందంటే.... పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

అప్రజాస్వామిక కుట్రను న్యాయపోరాటంతో ధైర్యంగా తిప్పికొట్టి పాత్రికేయ స్వేచ్ఛను కాపాడారంటూ తెలుగు వన్​ ఎండీ రవిశంకర్​కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తమ స్వప్రయోజనాల కోసం పాలకులకు దాసోహం కాకుండా తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

శ్రావణి ఆత్మహత్య: బయటపడ్డ ఫోన్​ కాల్​ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.