దేశమంతా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్య్ర ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. అణచివేత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నాయకులు ఎన్నో మహోన్నత త్యాగాలు చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్ళు పడుతుంటే మహనీయుల త్యాగాలకు అర్థం ఏముందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన సంపదను మన పాలకులే దోచుకుంటుంటే.. ఎస్సీ, గిరిజన, వెనుకబడిన వర్గాలను మన పాలకులే అణచివేస్తుంటే ఏం చేయాలని మండిపడ్డారు. జాతీయోద్యమ స్పూర్తితో పోరాడి మన సమాజాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు, అక్రమకేసుల వేధింపులు, భావప్రకటనకు సంకెళ్ళు లేని అభివృద్ధికర ప్రజాస్వామ్య పాలన రాష్ట్ర ప్రజలకు అందాలని.. ఆకాంక్షించారు. దేశభక్తులు ఆశించిన సమసమాజం దిశగా అందరం అడుగువేయాలని కోరారు.
ఇదీ చదవండీ.. CM JAGAN: 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన: జగన్