స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను.. కేంద్రం అనుమతించడంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్.. మనకు గర్వకారణం అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముప్పు కారణంగా శారీరకంగా ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా అంతా కోలుకుంటున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిన కారణంగానే.. కరోనా కట్టడి చేసుకోగలిగామని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: