ETV Bharat / city

'ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదు' - chandra babu on floods

ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టం ఏవీ వైకాపా ప్రభుత్వానికి లెక్కలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలు చేశారని దుయ్యబట్టారు. వరద ప్రాంతాల తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నిర్వహించారు. వైకాపా తప్పుడు విధానాలను ఎక్కడికక్కడ ఖండించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.

chandra babu fires on ysrcp government on flood management
చంద్రబాబు
author img

By

Published : Oct 15, 2020, 2:23 PM IST

భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతుంటే... ప్రభుత్వం సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తినష్టం ఏవీ లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల తెలుగుదేశం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించాలన్నారు.

అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. జల నిర్వహణలో విఫలమయ్యారని.. నీటిని సకాలంలో సరైన మోతాదులో విడుదల చేయలేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నరగా వరుస విపత్తుల్లో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సాయం అందజేయలేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా తుపాను తీరందాటే సమయాన్ని, తాకే సమయాన్ని ముందుగానే అంచనా వేసి ప్రాణ, ఆస్తి నష్టం నివారించామని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి రెండూ లేవని విమర్శించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని... పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అవినీతిని బహిర్గతం చేయాలి

"వైకాపా ఇచ్చిన ఇళ్ల స్థలాలు ముంపునకు గురవ్వడంతో వారి అవినీతి బయటపడింది. మెడలోతు నీళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం దుర్మార్గం. నీటమునిగిన ఇళ్ల స్థలాల ప్రాంతాలను సందర్శించి అవినీతిని ఎండగట్టాలి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి వరి, పత్తి, మిరప, వేరుశనగ, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లు నీట మునిగి వేల కిలోమీటర్ల రహదారి ధ్వంసమైంది." చంద్రబాబు

ఇదీ చదవండి: రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.