ETV Bharat / city

FAKE CHALLANS: నకిలీ చలానాల కుంభకోణం..ప్రభుత్వం అంతర్గత విచారణ

నకిలీ చలానాల కుంభకోణంపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది. జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. రిజిస్ట్రేషన్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వానికి రూ.5.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

CHALLANS
CHALLANS
author img

By

Published : Aug 13, 2021, 2:24 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నకిలీ చలానాల కుంభకోణంపై ప్రభుత్వం అంతర్గత విచారణ ముమ్మరం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ, డీఐజీల ఫిర్యాదు మేరకు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఏడాది క్రితం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నకిలీ చలానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. మొత్తం రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగి ఉండొచ్చని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది.

ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్‌లను సస్పెండ్ చేశారు. మంగళగిరి, విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నకిలీ చలానాల వ్యవహారంలో తనిఖీలు జరుగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై కొందరు సబ్ రిజిస్ట్రార్​లే ఈ అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఈ చలానాను ఆస్తుల రిజిస్ట్రేషన్​కు జతపరిచేలా సాఫ్ట్​వేర్​లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: viveka murder case: వివేకా కేసు.. కడప, పులివెందులలో అనుమానితుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.