ETV Bharat / city

Speaker Tammineni: 'అత్యాచాారానికి పాల్పడేవారికి మరణమే శరణ్యం కావాలి' - మహిళలపై స్పందించిన తమ్మినేని సీతారం

శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో దిశ యాప్‌పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆ సమావేశంలో పాల్గొన్నారు. అత్యాచారనికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాంటి సమాంతర న్యాయం జరిగినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

Chairman Tammineni seetha ram
సభాపతి తమ్మినేని సీతారం
author img

By

Published : Jul 24, 2021, 2:17 PM IST

మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని భూమ్మీద లేకుండా చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో దిశ యాప్‌పై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అవుట్‌ ఆఫ్‌ ది లా వెళ్తేనే సమాజంలో సమాంతర న్యాయం జరుగుతుంది. మగవాళ్ల ఆలోచన విధానం మారాలి. ఎక్కడో ఒకచోట దీన్ని ఆపకపోతే న్యాయానికి అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ని మరోసారి అభినందిస్తున్నాను. మగవాడు సమాజానికి రక్షణ ఇవ్వాలి. మృగంలా మారి మృగాడిగా వ్యవహరిస్తే ఎలా..? వారిని క్షమించకండి. స్త్రీని అగౌరవపరిచి బలవంతం చేసినవాడు ఈ భూమ్మీద ఉండటానికి వీల్లేదు. చట్టాలు ఏం చేస్తాయో నాకు తెలియదు. అలాంటి సమాంతర న్యాయం జరిగినప్పుడే అసలైన శిక్ష పడుతుంది. హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు’ అన్నారు.

రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జలవివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ నడుం బిగించారని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని, ఆయన జూమ్‌ సమావేశాలు నిర్వహించి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

High Court on Jagan Govt: 'వాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలు.. హై కోర్టు న్యాయమూర్తులకూ లేవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.