ETV Bharat / city

'ఏపీఎస్​ఆర్టీసీ విభజనకు ఏపీ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు' - apsrtc news

ఏపీఎస్​ఆర్​టీసీ విభజన కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన కేంద్రానికి రాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Centre on aprstc formation
'ఏపీఎస్​ఆర్టీసీ విభజనకు ఏపీ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు'
author img

By

Published : Dec 2, 2019, 11:59 PM IST

ఏపీఎస్​ఆర్​టీసీ విభజన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో..కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆయన... టీఎస్​ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేదని తెలిపారు. రహదారి రవాణా సంస్థల చట్టం 1950లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, మూసివేత అంశంపై మాత్రం 1950 చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం కేంద్రం ముందస్తు అనుమతి రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 1958లో కేంద్ర ప్రభుత్వం ఏపీఎస్​ఆర్​టీసీకి 31 శాతం మూలధన వాటా సమకూర్చిందని ఆ విలువ 61 కోట్ల రూపాయలని తెలిపారు.

ఇదీ చదవండి :

ఆర్టీసీ విలీనానికి పాలకమండలి ఓకే

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.