Centre On AP Bifurcation Promises: విభజన హామీలు చాలా వరకు నెరవేరాయని కేంద్రం వెల్లడించింది. తెదేపా ఎంపీ కనకమేడల అడిగి ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. మరికొన్ని హామీల అమలు.. పలు దశల్లో ఉన్నాయని పేర్కొంది. విభజన హామీల అమలుకు మూడేళ్ల సమయం ఉందన్న కేంద్ర హోంశాఖ.. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు హోంశాఖ 25 సార్లు సమీక్షలు చేశామని మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు.
కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి వైకాపా ఎంపీలు..
YSRCP MPs Meet Nirmala Seetharaman: దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను వైకాపా ఎంపీల బృందం కలిసింది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో కలిసిన పార్లమెంట్ సభ్యులు.. రాష్ట్ర సమస్యలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:
పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!