దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి.. వారిని ఒలింపిక్స్‌కు పంపటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తు ఒలంపిక్స్‌ని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులకు ఆహారం, ఆరోగ్యం సహా శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఉస్మానియా వర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద కేటాయించిన నిధులతో ఓయూలో మహిళా స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.
భవిష్యత్తు క్రీడా ప్రతిభను ముందుకు తీసుకురావాలనేటటువంటిది మన ముందున్న సమస్య. ఒలంపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం.. టార్గెట్ ఒలంపిక్ పేరుతోటి మరి క్రీడాకారులకు అన్ని రకాలుగా అంతర్జాతీయ స్థాయిలో.. హెల్త్ విషయంలో కావచ్చు, ఫిట్నెస్ విషయంలో కావచ్చు.. ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు. అన్ని రకాలుగా అన్ని క్రీడల్లో టాప్ స్కీం కింద అత్యంత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్లను ఒలంపిక్స్‌కు తయారు చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ప్రారంభించింది. క్రీడాకారులుగా ఉన్నటువంటి వాళ్లు ఏ రంగంలోకి వెళ్లినా.. మెరుగైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి నేను ప్రతీ విద్యార్థిని కూడా కోరుతా ఉన్నాను. ఏదో ఓ ఆటలో ఎక్స్పర్ట్ కాకపోయినా కూడా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే.. జీవితంలో అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యటకశాఖ మంత్రి
అంతర్జాతీయ స్థాయిలో మనదేశం క్రీడల్లో వెనకబడిపోతున్నందునే.. కేంద్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. క్రీడలపై పట్టుంటే ఏ రంగాల్లోనైనా రాణించే అవకాశముంటుందని.. అందుకోసం ప్రతి విద్యార్థి ఏదో ఆటపై పట్టు పెంచుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
గ్రామీణ స్థాయి నుంచి కూడా క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో.. విలేజ్ లెవెల్ నుంచి మనం నేషనల్, ఇంటర్ నేషనల్ లెవెల్ వరకు చేయడానికి ఇవాళ గొప్పగా ప్లానింగ్ జరుగుతోంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి క్రీడా పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇటు రాష్ట్రంలో కాని, అటు కేంద్రంలో కాని సంయమనం చేసుకొని అత్యధిక నిధులు వచ్చేటట్టు పని చేయాలని కోరుతున్నా-శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి
ఇదీ చూడండి:
Telugu Language Day: పలుకు పరవశం.. మాట మాధుర్యం.. ఇదీ తెలుగు గొప్పతనం!