ETV Bharat / city

ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాల్సిందే: కేంద్రం

పీపీఏల్లో చేసుకున్న ‍ఒప్పందం ప్రకారం పునరుత్పాదక ఇంధన సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది.

central govt on ppa
author img

By

Published : Oct 4, 2019, 5:26 AM IST

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సమీక్ష వ్యవహారంలో ప్రధాని, హోం మంత్రితో చర్చించిన తర్వాతే.... గత నెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ పేర్కొన్నారు. అయినా ఇంతవరకు ఆ లేఖకు సమాధానం రాలేదన్నారు. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేయడంలేదన్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందన్న ఆయన.... ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతీ తమకు తెలుసు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్‌ కోతలు ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందన్నారు. పీపీఏలతో పాటు వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతానని ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం...సీఎం జగన్​కు కేంద్రమంత్రి​ లేఖ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.