ETV Bharat / city

దిశ బిల్లును తిప్పిపంపిన కేంద్రం - దిశ బిల్లును తిప్పిపంపిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులో లోపాలున్నాయని, వాటిపై అభ్యంతరాలు తెలిపింది. దిశ బిల్లు - 2019ని గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే.

దిశ బిల్లు - 2019ని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది.

author img

By

Published : Oct 16, 2020, 5:32 AM IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులో లోపాలున్నాయని, వాటిపై అభ్యంతరాలు తెలిపింది. సరిచేయాలంటూ వెనక్కి పంపింది. దీంతో ఈ చట్టం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. కేంద్రం సూచించిన అంశాలతో మళ్లీ కొత్త ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఆమోదించుకోవాలి.

హైదరాబాద్‌ శివారులో గతేడాది జరిగిన దిశ అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారిని 21 రోజుల్లోనే శిక్షించేందుకు వీలుగా సర్కార్‌ ఈ బిల్లును తెచ్చింది. క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి....పదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష, గరిష్ఠంగా మరణ నిబంధన విధించేలా రూపొందించిన దిశ బిల్లు - 2019ని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. నేరం జరిగినప్పుటి నుంచి 7 పనిదినాల్లో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి....అభియోగపత్రాలు దాఖలు చేయాలని, ఆ ప్రక్రియ తర్వాత 14 రోజుల్లో న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తికావాలని బిల్లులో నిర్దేశించింది. శిక్ష పడితే దానిపై హైకోర్టుకు వెళ్లేందుకు 3 నెలలే గడువిచ్చింది. ఈ బిల్లు ద్వారా ఐపీసీలో ఏపీ భూభాగానికి మాత్రమే వర్తించేలా కొత్తగా... 354 – E, 354 – F, 354 – G వంటి 3 సెక్షన్లను జోడించింది. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత....కేంద్రం అనుమతి కోసం పంపింది. అయితే బిల్లుపై కేంద్రం పలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ తిప్పిపంపింది.

ఇదీ చదవండి

విజయవాడలో ఘాతుకం.. యువతిని చంపిన ప్రేమోన్మాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.