ETV Bharat / city

Zonal line clear: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం - తెలంగాణ వార్తలు

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Central approval for changes and additions to the zonal system in telangana
జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం
author img

By

Published : Jun 30, 2021, 10:39 PM IST

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్​లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్​లో చోటు కల్పించారు. స్థానికంగా ఉన్న విజ్ఞప్తుల మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్​కు మార్పు చేశారు. ఇక నుంచి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తారు.

కాళేశ్వరం జోన్
భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు

బాసర జోన్

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు

రాజన్న జోన్‌‌

కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు

భద్రాద్రి జోన్​

వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు

యాదాద్రి జోన్‌

సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు

చార్మినార్‌ జోన్‌

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు

జోగులాంబ జోన్‌

మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, నారాయణపేట జిల్లాలు

మల్టీ జోన్-1

కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు

మల్టీ జోన్-2

యాదాద్రి, చార్మినార్​, జోగులాంబ జోన్లు

ఇదీ చదవండి:

YSR Bima: రేపు వైఎస్​ఆర్​ బీమా పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.