ETV Bharat / city

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే - బడ్జెట్​లో ఏపీకి అన్యాయం

రాష్ట్ర విభజన సమయంలోనూ, ఆ తర్వాతా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తూనే ఉంది. విభజన కష్టాలు, ఆర్థిక సమస్యలు, ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోంది. నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో ధనిక రాష్ట్రాలకు అన్నీ వడ్డిస్తున్న కేంద్రం.. విభజనతో రాజధాని సహా అన్నీ కోల్పోయి, మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌పై అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తోంది.

union budget 2021
allocation of funds to ap
author img

By

Published : Feb 5, 2021, 4:07 AM IST

Updated : Feb 5, 2021, 5:42 AM IST

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే

దక్షిణాది రాష్ట్రాలతో సమాన ప్రాధాన్యమివ్వడం లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చటం లేదు. ఇదిగో నివేదికలు సిద్ధం చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నాం అంటూ నెట్టుకొస్తోంది. ఏటా కేంద్ర బడ్జెట్‌ కోసం ఆశగా ఎదురు చూడటం.. చివరికి పరిపాటిగా మారింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల్లేవు. సేవారంగంలో చాలా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఉపాధి కావాలన్నా... పొరుగు రాష్ట్రాలకో, విదేశాలకో వలస పోవాల్సి వస్తోంది. ఇవన్నీ తెలిసీ.. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకపోవటం, విభజనతో అన్నీ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవీ ఇవ్వకపోవడం గమనార్హం.

అందరికీ ఇచ్చినా.. మనకు మెట్రో లేదు

కేంద్ర బడ్జెట్‌లో ఇప్పటికే మెట్రో రైళ్లున్న చోట వాటి విస్తరణకు రూ.వేల కోట్ల నిధులిచ్చారు. 2020-21 బడ్జెట్‌లో బెంగళూరుకు సబర్బన్‌ రవాణా రైల్వే ప్రాజెక్టుకు రూ.18,600 కోట్లు ప్రతిపాదించారు. 2021-22 బడ్జెట్‌లో బెంగళూరు మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రూ.14,778 కోట్లు కేటాయించారు. చెన్నై మెట్రో ప్రాజెక్టు రెండో దశకు రూ.63,246 కోట్లు, కొచ్చి మెట్రో రెండో దశకు రూ.1,957 కోట్లు కేటాయించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో వాటిపై కనీస ప్రస్తావన కూడా లేదు.

దక్షిణాది రాష్ట్రాలతో పోలికేదీ?

మిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ నగరాలు ఆర్థికంగా, ఉపాధిపరంగా వెన్నూ దన్నూ. అలాంటి నగరం ఏపీలో లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నన్ని పరిశ్రమలూ, ఐటీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలూ రాష్ట్రంలో లేవు. విద్య, వైద్య, పారిశ్రామిక, వాణిజ్య, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపరంగా.. ఆ రాష్ట్రాల కంటే ఏపీ చాలా వెనుకబడి ఉంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకైనా చేయూతనివ్వండంటూ కేంద్రాన్ని రాష్ట్రం వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. కేంద్ర బడ్జెట్లలోనూ రాష్ట్రానికి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది.

జాతీయ రహదారుల్లోనూ వివక్ష...

మిళనాడుకు 2020-21 బడ్జెట్‌లో చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవేను మంజూరు చేశారు. 2021-22లో తమిళనాడులో 3,500 కి.మీ.ల పొడవైన జాతీయ రహదారులకు రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని ప్రతిపాదించారు. చెన్నై-సేలం కారిడార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. అవన్నీ పూర్తిగా ఆ రాష్ట్ర పరిధిలో వచ్చే ప్రాజెక్టులే. కేరళలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ.65 వేల కోట్లు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చిత్తూరు- తాచ్చూరు, విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి మాత్రమే ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. అవి కూడా మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మొదలై.. సింహభాగం వేరే రాష్ట్రాల్లో కొనసాగుతాయి.

రైల్వే ప్రాజెక్టుల్లో మొండిచెయ్యి...

విశాఖ రైల్వే జోన్‌ విభజన హామీల్లో ఉన్నా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. నిధులూ కేటాయించలేదు. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి గత రెండు బడ్జెట్లలో కేటాయింపు అక్షరాలా వెయ్యేసి రూపాయలు మాత్రమే. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఖరగ్‌పూర్‌-విజయవాడ, విజయవాడ-ఇటార్సీ సరకు రవాణా కారిడార్లు మాత్రం కొత్తవి. అవి కూడా జాతీయ ప్రాధాన్యమున్న, అనుసంధాన ప్రాజెక్టుల్లో భాగంగా మంజూరు చేసినవే.

తలసరిలో అట్టడుగున....

ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి అక్కడి ప్రజల తలసరి ఆదాయమే కొలమానం. ఈ విషయంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనుకబడి ఉంది. 2020-21 ఆర్థిక సర్వే లెక్కలే దీనికి నిదర్శనం.

విభజన హామీల్నీ విస్మరించారు..

1. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు దాటింది. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో హామీ ఇచ్చినా ఇప్పటికీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు.
2. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2014లోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అప్పటి నుంచి దీనికి కేంద్రం ఇచ్చింది రూ.10,741 కోట్లు మాత్రమే. 2017-18 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.55656.87 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర జలసంఘం తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఏటా సగటున రూ.2 వేల కోట్లు చొప్పున ఇస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?
3. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో రైల్వే మంత్రి ప్రకటించారు. దానికనుగుణంగా డీపీఆర్‌ పంపించారు. తాజా బడ్జెట్‌లోనూ దాని ప్రస్తావనే లేదు.
4. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. మూడేళ్లలో మొత్తం రూ.1,050 కోట్లు ఇచ్చారు. తర్వాత వాటి ఊసే లేదు.
5. విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటు లోటు రూ.16,078 కోట్లని కాగ్‌ పేర్కొంది. కేంద్రం రూ.4,117 కోట్లేనని తేల్చి.. అందులో రూ.3,975.50 కోట్లు మాత్రమే ఇచ్చింది.
6. దుగరాజపట్నం ఓడరేవు ఆర్థికంగా లాభదాయకం కాదని అప్పట్లో నీతిఆయోగ్‌ ప్రకటించింది. తర్వాత దాని గురించి కేంద్రం మాట్లాడటం లేదు.
7. కడప ఉక్కు కర్మాగారం, పెట్రో రసాయనాల ప్రాజెక్టు హామీలనూ కేంద్రం పూర్తిగా విస్మరించింది.
8. విభజన హామీల్లో భాగంగా మంజూరైన 11 కేంద్ర విద్యా సంస్థల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో వసతులు, భవనాలు సమకూరలేదు.
9. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులూ నత్తనడకన సాగుతున్నాయి.
10. కేంద్ర ప్రభుత్వం గతంలో రాజధాని అమరావతి నిర్మాణానికి కోసం రూ.1,500 కోట్లు, గుంటూరు, విజయవాడల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మిగులు నిధుల నుంచి గుంటూరు, విజయవాడ నగరాలకు కేటాయించిన ఈ రూ.వెయ్యి కోట్లనూ కూడా రాజధానికి చేసిన ఆర్థికసాయంగానే చూపింది.
12. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాలుగా గుర్తించింది. కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం లేవు. కొవిడ్‌కు ముందు వరకు విశాఖకు మూడు నాలుగు విమాన సర్వీసులు నడిచేవి. తర్వాత అవీ నిలిచిపోయాయి.

ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రధానంగా దక్కిందివే..

* దేశంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామని చెబుతూ వాటిలో ఒకటి విశాఖకు ఇచ్చారు. అదీ కొత్త ప్రాజెక్టు కాదు. విశాఖలో ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌కు కొత్త మెరుగులు దిద్దుతామని చెప్పారు.
* శీవిశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.595 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్‌లో చూపించారు. మరోపక్క దాన్ని ప్రైవేటీకరించేందుకు వేగంగా అడుగులేస్తున్నారు.

సేవారంగంలో తీవ్రమైన వెనుకబాటు...

సేవారంగంలో ఆంధ్రప్రదేశ్‌ చాలా వెనుకబడి ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవారంగం వాటా 38 శాతం మాత్రమే. కేరళలో ఇది 57, కర్ణాటకలో 58, తమిళనాడులో 50, తెలంగాణలో 58 శాతంగా ఉంది. అమెరికా సహా వివిధ దేశాల్లోను, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌వారు వేల మంది ఉంటారు. వారిలో ఎవరైనా సొంత రాష్ట్రానికి వచ్చి పనిచేద్దామంటే.. ఉద్యోగమిచ్చే ఐటీ కంపెనీలు ఇక్కడలేవు. ఆతిథ్య, పర్యాటక, ఆర్థిక సేవల రంగాలూ అభివృద్ధి చెందలేదు. విభజనకు ముందు విశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా తర్వాత అతీగతీ లేదు.

ఇదీ చదవండి

హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం

Last Updated : Feb 5, 2021, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.