ETV Bharat / city

Bulk drug Park రాష్ట్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు.. ఆమోదం తెలిపిన కేంద్రం - కేంద్ర ఔషధ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ

Bulk drug Park in AP రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కేపీ పురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియజేస్తూ... సీఎస్‌కు లేఖ రాసింది. వారం రోజుల్లోగా అంగీకారాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనుంది.

Bulkdrug Park
బల్క్‌డ్రగ్‌ పార్కు
author img

By

Published : Aug 31, 2022, 7:41 AM IST

బల్క్‌ డ్రగ్‌ పార్కు

రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కును కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం , కోదాడ గ్రామాల పరిధిలో ఈ పార్కుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులు ఔషధ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ ఎన్ .యువరాజ్ ...సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. అనుమతి లేఖ అందిన వారం రోజుల్లోగా ప్రాజెక్టు ఏర్పాటు కోసం అంగీకారంతెలియజేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఇఫ్కీకి... 90 రోజుల్లోగా ప్రాజెక్టు సవివర నివేదిక సమర్పించాల్సిందిగా సూచించారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను అందించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటులో భాగంగా కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వెయ్యి కోట్లు ఆర్ధిక సాయం అందించనుంది. దేశ వ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల కోసం 13 రాష్ట్రాలు పోటీ పడితే అందులో 3 రాష్ట్రాలు మాత్రమే వీటిని దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కు కోసం పోటీ పడ్డాయి.

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020 ఆగస్టులోనే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ప్రైవేటు ఆపరేటర్లు మొత్తంగా 6వేల 940 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. ఇందుకోసం ప్రత్యేక వాహక సంస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బల్క్‌ డ్రగ్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ..అవి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి పదేళ్లు గానీ, స్థిర మూలధన పెట్టుబడిని 125 శాతం రాబట్టుకునే వరకుగానీ జీఎస్టీని నూరు శాతం రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. MSMEలకు మూలధన పెట్టుబడిలో 15 శాతం గానీ గరిష్ఠంగా 20 లక్షల వరకు గానీ రాయితీగా ఇస్తామని పేర్కొంది. 80 శాతం సామర్థ్యంతో మూడేళ్లపాటు విరామం లేకుండా ఉత్పత్తి చేసిన తర్వాతే రాయితీ అందజేస్తామని స్పష్టం చేసింది. కంపెనీలు చెల్లించే స్టాంపు డ్యూటీ , ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని 100 శాతం రీయింబర్స్‌ చేస్తామని తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.